'ఎవరికైనా ఒక చేపను ఇస్తే ఆ పూటకు వారి కడుపు నింపవచ్చునేమో; కాని, చేపలను పట్టుకోవడం ఎలానో వారికి నేర్పిస్తే జీవితాంతం వారి ఆకలి తీర్చినట్టవుతుంది' అని ఆంగ్లంలో ఒక నానుడి వుంది. తెలుగులో కూడా 'కట్టించిన మూట, చెప్పించిన చదువు ఎంతోకాలం ఉపయోగపడవు' అనే సామెత వుంది. కట్టించిన అన్నం మూట ఎంతకాలం వస్తుంది? అలానే కేవలం ముక్కున పట్టుకున్న చదువు ఎందుకు ఉపయోగపడుతుంది? వాటిని జీవితకాలానికి విస్తరించుకోవడంలోనే వివేకమైనా, వికాసమైనా. శ్రీనివాసరావుగారి వ్యాసాలన్నీ అలాంటి వివేకాన్ని మేల్కొలిపేవే. ఎక్కడ చూసినా నిరుద్యోగం తాండవిస్తున్న పరిస్థితిలో ఆ సమస్యకు అందుబాటులో, అనువైన పరిష్కారాన్ని అక్షరరూపంలో అందించారు 'మైనంపాటి శ్రీనివాసరావు'. - జె.వి.క్రిష్ణమూర్తి

Pages : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good