మతిమరుపును పోగొట్టుకోవాలనుకునే వారందరూ, ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్యనిర్వాహకులు, వయోవృద్ధులు తప్పక చదవాల్సిన పుస్తకం.

మతిమరుపును మరిపించటం ఎలా?

సమస్యా పరిష్కార శక్తి : ఒక వ్యక్తి యొక్క సమస్యా పరిష్కార శక్తి స్తూలంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన సమస్యను సంపూర్ణంగాను, సమగ్రరంగాను అవగాహన చేసుకోవటం ప్రధమ దశ. ఈ దశలో మన శ్రద్ధ, ఏకాగ్రత, సమస్యకు మనకు ఉన్న అనుబంధం మన అవగాహనకు తోడ్పడతాయి. సమస్యను సంపూర్ణంగాను, సంగ్రహణంగాను నిర్వచించగల్గితే పరిష్కార మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు హోం వర్కుకే ప్రాధాన్యం ఇస్తే త్వరలో లక్ష్యాన్ని సాధించకల్గుతాం. కాని ఏదో సాకుతో హోం వర్కును వాయిదావేస్తే నష్టపోయేది మనమే నన్న సత్యాన్ని గ్రహిస్తే వాయిదా వేయకుండా కృషి చేయటానికి వీలు కలుగుతుంది. అప్పుడు ఇంతకు ముందు జ్ఞాపకంలో నిక్షిప్తమయిన పాఠ్యాంశాన్ని వెలికితీసి హోం వర్కులోని అంశాలతో సమన్వయం చేసి పరిష్కారాన్ని కనుగొనవచ్చును అలా లభ్యమయిన పరిష్కారానికి కార్యరూపం కల్పించి పుస్తకాలలో వ్రాయాలి. తరగతిలో పాఠాలు వింటున్నప్పుడు పాఠ్యాంశాన్ని శ్రద్ధతో విని, జ్ఞాపకశక్తిలో, క్రమపద్ధతిలో పొందికగా పేర్చుకోకపోతే హోం వర్కు చేసేటప్పుడు అనేక అనుమానాలు వస్తాయి.....

Pages : 41

Write a review

Note: HTML is not translated!
Bad           Good