నీలోని విద్య ఐశ్వర్యంలో ఆభరణంగా,

    దరిద్రంలో ఆప్తునిగా ఆదుకుంటుంది.

    

    చివరిగా...

    

    మేధస్సు రెండువైపులా

    పదునుగానున్న కత్తి లాంటిది.

    ఉపయోగించే వారి ఆలోచనలపై దాని పనితీరు ఆధారపడి

    ఉంటుంది. నేటి ప్రపంచానికి కావలసింది మేధావులు అందించిన

    ప్రగతి కారకాలను జాతి వినాశనానికి కాకుండా విశ్వమానవ

    కల్యాణానికి ఉపయోగించడమే. అదే నేటి విశ్వమానవుని

    ప్రధానలక్ష్యం కావాలి. అప్పుడే విజ్ఞానం పొందిన మనిషికి దానివల్ల

    మనిషి సాగించిన ప్రగతికి అర్థం, పరమార్థం ఉంటుంది. ఏ

    ప్రయోగమైనా, పరిశోధనైనా, పరికరమైనా మనిషి ఉపయోగానికి,

    ప్రపంచశాంతికే అన్నది ప్రతి మనిషి మనసులో ఉన్నవాడు

    ప్రపంచమంతా ప్రశాంతత నెలకొంటుంది. అప్పుడే మనిషి సాధించిన

    విజ్ఞానానికి అసలైన సార్థకత.

 

    విజయాన్ని ప్రేమించు, అభిమానించు,

    అయితే ఆ విజయం వల్ల వచ్చే గర్వాన్ని మాత్రం ద్వేషించు

    అదే అసలైన విజ్ఞత.

Write a review

Note: HTML is not translated!
Bad           Good