గత శాతాబ్దికాలం నుండి సైన్సు ఫిక్షన్ రంగం పాశ్యాత్యదేశాలలో అభివృద్ధి చండుతూ మానవ మేధా సంపత్తి, ఊహాశక్తి , ఆలోచనాపటిమలకు నూతన గవాక్షాలు తెరచింది. దీని ఆధారంగా వివిధ  శాస్త్ర విజ్ఞాన రంగాలు, ముఖ్యంగా రోదసి, రంగం ఇతోధిక ప్రగతి సాధించగలిగాయి. నూతన విజ్ఞాన శాస్త్రాలూ ఆవిర్భవించాయి. సైన్సు మీద ఆలోచనాశక్తి మీద పాఠకులకు ఒక నూతన దృక్కోణం ఏర్పరచి, స్పూర్తి అందించడానికి ఈ వైజ్ఞానిక గ్రంధరచనను ప్రసిద్ద పావులర్ సైన్సు రచయిత శ్రీ వాసవ్య గారు కూర్పు చేసారు. మా పావులర్ సైన్సు గ్రంధాలను ఆదరించుతూ , అభిమానిస్తున్న పాఠకులకు ఇది ఒక వినూత్న తరహా పురస్కారం, తెలుగులో ఈ అంశం మీద తోలి విస్తృత సమాచార గ్రంధంగా దీనిని వెలువరిస్తున్నాం. దీనిని కూడూ సైన్సు అభిమానులు సమాదరించగలరని ఆకాంక్షిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good