తెలుగులో సైన్స్‌ రచనలు రావాల్సినంత రాలేదు. ఎందుకో ఏమో అంటూ కారణాల చూరు పట్టుకుని వేలాడి లాభంలేదు. ఇది సైన్స్‌ యుగమని చెప్పుకోవాలి. మన దైనందిన జీవితాలపై విజ్ఞాన శాస్త్ర ప్రభావం అనివార్యమని ఒప్పుకోవాలి. మానవమేధ అంతకంతకు పరుగులు తీయకపోతే మనిషి ఎప్పటికీ ఆదిమానవుడిగానే పరిమితవ్యాసార్థంలో పడిన కెరటంలా ఉండేవాడు. నిప్పు కనుక్కోవటంతో మానవజీవితం మలుపుతిరిగింది. 'చక్రం' రాకతో మానవేతిహాసం అమాంతం మారిపోయింది.
    నిప్పు, చక్రం సృష్టికర్తల పేర్లు మనకి తెలీకపోవచ్చు. ఆధునిక జీవితంతో పెనవేసుకున్న సైన్సు ప్రస్థానం గ్రహించకపోతే మనుగడ లేనట్టే. సైన్సు మెడలో నూతన ఆవిష్కరణల పూలమాలల గుబాళింపును గుర్తెరగటం మన కనీసధర్మం. నవగ్రహాలకు రెండితల కొత్త గ్రహాల్ని, అంతరిక్ష పరిశోధకులు లోకానికి విదితం చేశారు. గ్రహశకలాల వల్ల భూమికి ఎదురయ్యే సవాళ్ళను అంచనా వేస్తున్నారు. ఉపరితల ఉష్ణోగ్రతల వల్ల మాల్దీవులు లాటి దేవాలు కనుమరుగవుతాయని హెచ్చరిస్తున్నారు. చంద్రమండలం మానవ నివాసయోగ్యం కావచ్చని ఆశలు రేకెత్తిస్తున్నారు. రసాయన పరీక్షలతో సత్యశోధన శకం మొదలైంది. సృషఙ్టకి ప్రతిసృష్టిగా మరో విస్ఫోటానికి అకుంఠితదీక్షతో మానవయత్నాలు సాగుతున్నాయి.
    ఈ నేపథ్యాన్ని అందిపుచ్చుకుని సైన్సు ఆవశ్యకతని ఆవిష్కరిస్తూ పాత్రికేయ మిత్రుడు శ్రీవాసయ్య నాలుగొందల పుటలకి పైబడ్డ ఉద్గ్రంథం - 'సైన్స్‌ ఫిక్షన్‌'ను తెలుగు పాఠకలోకానికి కొత్త ఏడాది కానుకగా అందిస్తున్నందుకు సిరాభివందనలు.
    శ్రీవాసవ్య శ్రమకోర్చి అందించిన గ్రంథమే  'సైన్స్‌ ఫిక్షన్‌'.
పేజీలు : 424

Write a review

Note: HTML is not translated!
Bad           Good