సైన్సు ప్రతి ఒక్కరి సొత్తు !
సమాజంలో ప్రతి ఒక్కరి జీవితం సైన్సుతో ముడిపడి ఉంది. శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా, ఎన్నెన్ని కొత్త పరికరాలు రూపొందించినా ఆ కృషి పరమార్థం మానవ జాతి ప్రగతికోసం. అందుకే అవన్నీ జాతికి అంకితం. ఫలితం సైన్స్‌ ప్రతి ఒక్కరి సొత్తు.
ఈ సృష్టిలో అన్నిటికన్నా అపురూపమైనది మానవమేధ. వేసే ప్రతి ముందడుగుకు మూలం మానవ వనరులు. విద్యార్ధి దశనుండి ప్రతిఒక్కరూ ఈ జీవిత లక్ష్యాలను మానవ సుఖశాంతులవైపు కేంద్రీకృతం చేసుకోవాలి. అలాచేసుకోవాలంటే పెరుగుతున్న సైన్ను పరిశోధనలు వాటి అంతిమ లక్ష్యాలపై అవగాహన ఎంతో అవసరం.
ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న సైన్సు పరిశోధనలు - వాటి ఫలితాలు - సమాజ శ్రేయస్సు కోసం అవి ఎలా వినియోగపడుతున్నది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తేలిక తెలుగు భాషలో ఈ పుస్తకం రూపకల్పన చేయబడింది.
ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఈ పుస్తకం వారి బోధనలో నూతన సరళి చోటు చేసుకునేందుకు సహకరిస్తుంది. కొత్తకొత్త సైన్సు విషయాలు బోధనలో జోడిస్తే విద్యార్ధుల ఆసక్తి పెరగడమేగాక ఆయా అంశాలపై వారికి కొంత ప్రాధమిక అవగాహన కలుగుతుంది.
తల్లిదండ్రులకు ఈ పుస్తకం ఒక చక్కని నేస్తంగా ఉపయోగపడుతుంది. తమ బిడ్డలను చదువు వైపు ఆకర్షితులను చేసేందుకు ఇందలి విషయాలు అప్పుడప్పుడు వారికి చెబుతూ ఉంటే సరిపోతుంది. ప్రయత్నించే ప్రతి ఒక్కరికి విధానం తెలియాలి. ఆ లోటు ఈ పుస్తకం తీరుస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good