మానసిక వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి సైకోసిస్.. అందులోను మరింత ముఖ్యమైనది స్కిజోఫ్రినియా , దీనినే మన అచ్చ తెలుగులో పిచ్చి లేదా ఉన్మాదము అని పిలుచుకుంటాము. ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు యొక్క వింత ప్రవర్తన చూసి ఇప్పటికి మన దేశంలో గ్రామీణ వాసులు, పట్టణ వాసులు, చదువు కున్నవారు. చదువు లేని వాళ్ళు దెయ్యం పట్టిందని, భూతమావహించిందని, గాలి అని , చేతబడి అని, బాణా మతి అని, చిల్లంగి అని రకరకాలు నమ్మకాలతో వాళ్ళను మాంత్రికుల దగ్గరకు, తాంత్రికులు దగ్గరకు తీసుకెళ్ళటం గుడి చుట్టూ మసీదుల చుటూ పోల్లిగింతలు పెట్టించడం మనం చూస్తూనే ఉన్నాము. ఒకరోజు ఆందోళనగా ఉన్నా నిద్రపట్టక పోయినా మానసిక వైద్య నిపుణుని కలసి సలహా లేక వైద్యము చేయించుకొనే పాశాత్య వాసులున్న, కొంతమంది దేశ వాసులతో పోలిస్తే , సంవత్సరాల తరబడి స్కిజో ఫ్రీనియా లాంటి వ్యాధితో బాధపడుతూ కూడా సరి అయిన ఆధునిక వైద్యం అందక, చేయించక అజ్ఞానంతో , మూర్ఖత్వంతో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఉదంతాలు మన భారతదేశంలో ఎన్నెన్నో... ఈ నా చిన్న పుస్తకం ఏ కొంత మంది రోగగ్రస్తుల జీవితాన్ని మంచి మలుపు తిప్పిన నా జన్మ ధన్యం .
Rs.20.00
Out Of Stock
-
+