''రాజకీయాలను హైందవీకరించండి, హైందవాన్ని సైనికీకరించడండి''.. హిందూత్వ సిద్ధాంత కర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇచ్చిన నినాదమిది. నేడు కేంద్రంలోనూ, దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలను, చర్యలను పరిశీలిస్తే సావర్కర్‌ చూపిన మార్గంలో సంఘ్‌ పరివార్‌ పయనిస్తోందన్న విషయం బోధపడుతుంది. సంఘ్‌ పరివారం నేడు ప్రచారం చేస్తున్న ''హందూత్వ'' సిద్ధాంత రూపకర్త సావర్కర్‌. 1928లో ఆయన రాసిన ''హిందూత్వ: ఎవరు హిందువు'' అన్న కరపత్రంలో హిందూత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వాస్తవానికి 1923లో ఇంగ్లీషులో ''హిందూత్వ సారం'' అన్న శీర్షికతో వెలువడిన కరపత్రాన్ని సావర్కర్‌ మరాఠీలోకి అనువదిస్తూ దాని శీర్షికను మార్చాడు. విశేషం ఏమిటంటే సావర్కర్‌ నాస్తికుడు. ఆయనకు దేవుని మీద నమ్మకం లేదు. ఆయన హిందూ మతాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మలిచేందుకే హిదూత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

సావర్కర్‌ ప్రతిపాదన ఒక శాస్త్రీయ ఆవిష్కరణ అని ఆనాడు మతతత్వ వాదులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. హిందువుకు సావర్కర్‌ కొత్త నిర్వచనం ఇచ్చాడు. హిందూత్వం అనేది ఒక మతం కాదు జాతి, సంస్కృతి, రాజకీయ అస్థిత్వం అని నిర్వచించాడు. భారత దేశాన్ని పితృభూమిగా, పుణ్యభూమిగా ఎవరు భావిస్తారో వారే హిందువులని ఆయన నిర్వచించాడు. అంటే ఏ ప్రజల పూర్వీకులు ఈ దేశంలో పుడతారో, ఎవరి మతం ఈ దేశంలో జన్మిస్తుందో వారే హిందువులన్నమాట. ఈ సిద్ధాంతం ప్రకారం జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా హిందూత్వంలోకి వస్తారు.

Pages 174

Write a review

Note: HTML is not translated!
Bad           Good