ఈ సవర కథలకు ప్రయోజనం ఏమిటని ఆలోచిస్తే సవరమాట్లాడే ప్రాంతంలోని తెలుగువారికి సవర రీడర్లూ ఇవీ పక్కపక్కన పెట్టుకొని సవర నేర్చుకోవడానికి ఉపయోగపడడం మొదటిది. అయితే అంతకంటే ముఖ్యమైన ప్రయోజనం మరొకటుంది. సవరజాతివారి జీవనవిధానాన్ని తెలుసుకోవడం. వారి ఆచార వ్యవహారాలతోపాటు వారి స్వభావస్వరూపాలు తెలుసుకోవడానికి ఈ కథలెంతో ఉపయోగపడతాయి. ఆదివాసులపట్ల మనకు సాధారణంగా ఉండే అభిప్రాయాలు ఈ పుస్తకం చదివితే చాలావరకు మారిపోతాయి. వాళ్ళ అమాయకత్వానికి ఎంత విచారం కలుగుతుందో నాగరిక ప్రపంచ అమానవీయతకు అంత దు:కం కలుగుతుంది.

ఈ కథల్లో కొన్ని మనకు తెలిసిన పంచతంత్ర కథల్లాంటివి. మన నుండి వాళ్ళు నేర్చుకొన్నవి. అయినా వాటిలోనూ కొంతయినా సవర స్వభావం ఉండి తీరుతుంది. కేవలం సవరలకు సంబంధించినవి అమూల్యమైనవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good