నాలుగు లేక అయిదు సంవత్సరాల క్రితం తోటి అనుచరుల పట్టుదల వాళ్ళ నేను ఆత్మకధ వ్రాయుటకు అంగీకరించారు. వ్రాయటం ప్రారంభించి ఒక పుల్ స్కేప్ పేజి పూర్తీ చేశానో లేదో ఇంతలో బొంబాయి లో రగడ ప్రారంభమైంది . దానితో ణా ఆత్మ కధ ఆగిపోయింది. తరువాత అనేక పనుల్లో నిమగ్నమయ్యాను. చివరికి ఎర్రవాడ జైలు లో నాకు సమయం దొరికింది. జయదాస్ రాం భాయి కూడా అక్కడ వున్నాయి. మిగతా పనులన్నీ ఆపి నా  నిత్య కార్యక్రమాలు నిర్ణయమై పోయాయి.. అట్టి స్థితి లో ఆత్మకధ వ్ర్రాయటం కుదరదని చెప్పాను. అయితే శిక్షా కాలం పూర్తీ అయ్యేంతవరకు ఎరవాడ జైలో వుండే అవకాశం లభిస్తే మాత్రం ఆత్మకధ వ్రాయవచ్చుని అనుకున్నాను. అందుకు ఇంకా ఒక సంవత్సరం మిగిలి వుంది. అంతకు పూర్వం ప్రారంభించిన ఆత్మకధ ముందుకు సాగలేదు ఆరంభించగానే ఆగిపోయింది. ఇప్పుడు సామి ఆనంద్ ఆత్మకధ - వ్రాయటం తిరిగి ప్రారంభించమని కోరారు. ఈ లోపున నేను దక్షిణాప్రికా సత్యగ్రహ చరిత్ర పూర్తిచేశాను. అందువల్ల ఇక ఆత్మకధ ప్రారంభించ వచ్చునని భావించాను. నేను ఆత్మ కధను త్వరగా వ్రాసి , గ్రంధ రూపంలో ప్రకటించాలని స్వామి ఆనంద కోరిక. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good