జాబాలి ఆనాటి ఆదిభారతీయుడు. తాము నిర్మించిన దేశాన్ని ఆర్యులు ధ్వంసం చేస్తున్నప్పుడు తమ సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు, ఆర్య ఋషుల్ని ఎదిరించి పోరాడిన వాడు, సత్యకామ జాబాలి. జాబాలి మాటల్లోనే తనకీ, ఆర్య ఋషులకు ఉన్న వైవిధ్యాన్ని చూడండి.

''నేను నాస్తికుణ్ణి - వాస్తవాన్నే మాట్లాడతాను

నువ్వు ఆస్తికుడివి - అబద్ధాలే చెబుతావ్‌!

వొకే నాలికతో ఏకకాలంలో

రెండు మాటలు మాట్లాడే నువ్వా

నన్ను విమర్శిస్తోంది?

నా హృదయం అవునన్న ఆన్ని నా నాలిక కాదనదు

మనోవాక్కాయ కర్మలరీత్యా నామాటకీ చేతికీ తేడారాదు

ఆస్తికులు వాస్తవం చెప్పడం

పగలు వెన్నెలకాయడం - మగాడికి గర్భం రావడం

అవసర మొచ్చినప్పుడు మునగ చెట్కెటక్కించడం

అవసరం తీరాకా ముక్కు మీద గుద్దడం

పెళ్ళయేంతదాకా - అల్లుడా రమ్మనడం

ఐపోయిం తర్వాత ముండాకొడుకా పొమ్మనడం'' - సత్యకామజాబాలి

సత్యకామ జాబాలి ఒక సామాజిక సాంస్కృతిక విప్లవకారుడు. ఒక తాత్విక యోధుడు. ఒక తర్క శాస్త్ర పండితుడు. ఒక మానవతా ఉద్యమకారుడు. అందుకే వశిష్ఠుడిని, రాముడిని ఎదురించాడు. వాళ్ళ గుట్టును రట్టు చేశాడు. ఆనాడు జాబాలి విసిరిన ప్రశ్నలన్నీ మనముందు ఇలా ఉన్నాయి?....

Write a review

Note: HTML is not translated!
Bad           Good