1950 నుండి 1970 వరకూ అంటే సెల్యులాయిడ్‌ ప్రభావం పడక ముందు తెలుగునాట పట్టణాలలో, పల్లెలలో సాహిత్యాభిమానులను ఉర్రూతలూగించిన సాహిత్య ప్రక్రియ పౌరాణిక పద్యనాటకం.
చెల్లియొ చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచి రందఱుం
దొల్లి గతించె, నేడు నను దూతగు బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగుగు బొందు సేసెదో !
యెల్లి రణంబు గూర్చెదవొ ! యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా ! - తిరుపతి వేంకటకవులు
ఆ తరంలో ఈ పద్యాలు విద్యాగంథంలేని వారు కూడా ప్రదర్శనలు చూస్తూ నెమరు వేసుకోవడం నేనెరుగుదును. అవి చందోబద్ద కవిత్వమే కాక సాహిత్యపు పరిమళాలు వెదజల్లుతాయి. అందుకే ఈనాటి తరం పాఠకుల కోసం ఈ ప్రచురణ. - ప్రచురణకర్తలు

Write a review

Note: HTML is not translated!
Bad           Good