"కొల్లాయ గట్టితే నేమి? మా గాంధి కోమటైతేనేమి" అన్న భావకవి; "ఓ మహాత్మా ఓ మహర్షీ! ఏది సత్యం; ఏది అసత్యం ఏది నిత్యం ఏది అనిత్యం" అన్న మహాకవి: "ఇలాంటి మానవుడు ఈ భూమిమీద నడయాడాడంటే భావితరాలు నమ్మక పోవచ్చు" అన్న మరొక ప్రపంచ మేధావి పేర్కొన్న మహనీయుని 'సత్యశోధన' ఈ గాంధీ స్వీయచరిత్ర. సామాన్యులలో సామాన్యుడిగా సత్యం వీడని మహనీయుడిగా తన జీవితంలో సంశయాలు ఎదుర్కొన్నపుడు; తాను నమ్మిన సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు తాను ఎదుర్కొన్న బాధను నిస్సంకోచంగా చెప్పి కోట్లాది భారతీయులను ఏకత్రాటిపై నడిపి అహింస ద్వారా భారతీయ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించి దాన్ని సాధించిన మహానీయుని ఆత్మకథ. ఇది పూర్వానువాదానికి ఆధునిక పాఠకులకు అర్థమయ్యే రీతిలో మెరుగులు దిద్దిన సరళీకరణ.
- పబ్లిషర్స్

Write a review

Note: HTML is not translated!
Bad           Good