షేక్‌ హుసేన్‌ సత్యాగ్ని గారి ఈ సంపుటిలోని కథలన్నీ జాగ్రత్తగా చదివితే, ఆయన ఎవరి పక్షాన, ఏ భావజాలం కలిగివున్నాడో, ఏ భావాల నుండి బయటపడినాడో, ఎలాంటి ఆధునిక సమాజాన్ని కాంక్షించాడో, పాఠకులకు సులభంగా అర్థ మౌతుంది.  సమాజం పట్ల, ముఖ్యంగా స్త్రీలపట్ల, మతంపట్ల, రాజ్యవ్యవస్థ పట్ల ఇంకా అనేకానేక అంశాలపట్ల ఆయనకుగల దృక్పథాన్ని ఈ కథలు స్పష్టం చేస్తాయి.

మత సాంప్రదాయాలు అడుగడుగునా అడ్డుపడే ముస్లిం మతంలో పుట్టి, ఆ మతం మహిళలపట్ల విధించే ఎన్నో కట్టుబాట్లను, ఛాందస విధి విధానాలనూ విమర్శకు పెట్టే కథలు రాయడం చిన్నవిషయం కాదు. - సింగమనేని నారాయణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good