బ్రిటీషు పాలన ద్వంద్వనీతిని, దోపిడీని కమ్యూనిస్టు పార్టీ తన శక్తిమేర జనానికి చేరవేసింది. మత కల్లోలాకు, దేశ విభజనకు మతోన్మాదు రెచ్చిపోవడానికి బ్రిటీషు పాలకులే కారణమని కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. మహోజ్వల స్వాతంత్య్ర పోరాటంలో, కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, అశేష త్యాగాలతో, దీక్షా దక్షతతో కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమంలో పాల్గొంది. దేశ విముక్తికి తనవంతు కర్తవ్యాన్ని నెరవేర్చింది. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, నిరంకుశ స్వదేశీ సంస్థానాల దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన వేలాదిమంది కమ్యూనిస్టులు సదా స్మరణీయం. ఆస్తులు పోగొట్టుకుని, జీవితాల్ని, కుటుంబాలను పణంగా పెట్టి, తీవ్రంగా నష్టపోయిన పార్టీ కుటుంబాలు వేలకొలదే ఉన్నాయి. అలాంటి త్యాగధనుల కుటుంబాలు కమ్యూనిస్టు ఉద్యమానికి నిరంతరాయ స్ఫూర్తిప్రదాతలుగా ఉంటాయి.
పేజీలు : 149