మానవ వికాస పరిణామ క్రమంలో ప్రధాన అంశాలను చర్చించిన తర్వాత, స్త్రీ పురుష సంబంధాలలో వచ్చిన మార్పులను వివరించితేగాని రామాయణ, భారతాలు ఏనాటివో, వాటిని రాసిన వారెవరో శాస్త్రీయంగా తేలదని శ్రీ నాగభూషణం అభిప్రాయం.
భారతగాధ, రామాయణ గాథకు భిన్నమైనదని, రామాయణ గాథకు మూలం త్యాగం కాగా, భారత గాథకు మూలం రాజ్యకాంక్ష అయినందున ఈ రెండు దృక్పథాలు, ప్రయోజనాలు వేరుగా వున్నాయని ఈ రచయిత తేల్చారు.
ఈ రెండు కావ్యాలను గురించీ ఇంకా వివరంగా పరిశీలించి 'రామాయణ భారత గాధలు రెండూ శతావతారాలు ఎత్తినప్పటికీ, వాటిని చారిత్రక దృష్టితో పరిశీలించాలి'' అని, ప్రజల మనస్సులపై మత్తుమందు చల్లి, మూఢనమ్మకాలను పెంచే గ్రంథాలని వాటిని త్రోసి పుచ్చకూడదు అన్నారు రచయిత. ఇది నిజంగా ప్రశంసనీయమైన దృష్టి. నేటి యువతరం చదివి, ఆలోచించి, నిగ్గు తేల్చవలసిన అంశాలనేకానేకం ఉన్నాయి ఈ పుస్తకంలో....
పేజీలు : 128