'శాస్త్రీయ హోమియో వైద్యము' పుస్తకమందు ఏడు అధ్యాయములున్నావి.

1. సిద్ధాంత భాగము : దీనిలో హోమియోపతి మూల సూత్రములను అన్ని తరగతులవారికి సులభంగా అర్థమగునట్లు వివరింపబడినవి. ఈ అధ్యాయమునకు చివర 'హోమియో క్షణ వీక్షణము' అను శీర్షికతో హోమియోలోని ముఖ్యాంశములు అన్నీ వివరించుట జరిగినది.

2. చికిత్సా విధానము : గృహకృత్యములో తరచు వచ్చుచుండు కొన్ని ముఖ్యమైన జబ్బులకు చికిత్సా విధానము పరిమితంగా ఇందు పొందుపరచబడినది. దీనిని ఉపయోగమున్నంతవరకు ఉపయోగించుకుని మిగిలిన అవసరమలకు పెద్దలచే వ్రాయబడిన గ్రంథములను అధ్యయనము చేసికొనవలెను. ఎప్పటికప్పుడు అనుభవమున్న వైద్యుని సలహాలను కూడా తీసుకొనవలెను.

3. శరీర గుణదీపిక : ఇందు నిత్యము అవసరముపడు 81 ఔషధములను మాత్రము క్లుప్తంగా సులభశైలిలో వాటగి గుణగణములను యావత్తు యిమిడ్చి వివరించుట జరిగినది. వీటిని ఆధారంగా తీసుకొని మిగిలిన ఔషధములను అధ్యయనము చేసికొన వచ్చును.

4. ప్రత్యేక లక్షణములు-మందులు : ఇది కూడా ఆయా మందులను సూటిగా ప్రయోగించుటకు కాదు. దాని ద్వారా ఆ మందు యొక్క శరీర గుణదీపికను క్షుణ్ణంగా అర్థం చేసికొని ప్రయోగించుటకు మాత్రమే ఉద్దేశింపబడినది.

5. దీర్ఘవ్యాధులు-అవగాహన-చికిత్స : దీర్ఘవ్యాధులలో వివిధ రకాలైన మనోవైకల్యములు-చికిత్సా విధానము చర్చించబడినవి.

6. క్లిష్టవ్యాధులు-నివారణ : నివారణలైన క్లిష్టవ్యాధులు చేర్చబడినవి.

7. అనుబంధము - హోమియో విధానముపై ప్రత్యేక వ్యాసములు (రేడియో ప్రసంగములు)

పేజీలు : 408

Write a review

Note: HTML is not translated!
Bad           Good