మరణమనగా వినాశనం కాదు. మార్పు మాత్రమే. మరణ సమయంలో ఆత్మ దేహమనే తొడుగును వదిలిపెడుతుంది. మనం పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టు. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు తన కోరికలను తీర్చుకుని కొన్ని కార్యాలను నిర్వహించి ఆ పైన శరీరాన్ని వదిలి, మరొక శరీరాన్ని ధరిస్తుంది. మన ఆలోచనలూ కర్మల ననుసరించే మన భవిష్యత్‌ను మనమే నిర్మించుకుంటాము.

ఈ ఉత్కృష్ట సత్యం భారతీయ జీవన దృక్పథానికి మూలం.

మనిషిలో మరణానంతరం ఐహికమైన కోరికలు మిగిలి ఉంటే, మానవ క్షేత్రంలోనే అవి నెరవేర్చబడతాయి. తిరిగి భూమిమీద జన్మించేటట్టు చేస్తాయి. మరణ సమయంలో ఏ విషయాన్ని గురించిన ఆలోచనలుంటాయో ఆ దిశగానే సూక్ష్మ శరీరం పయనించి నిర్దేశించిన గమ్యాన్ని జేరుకుంటుంది. సరిక్రొత్త శక్తి తో బలంతో భావాలతో క్రొత్త జీవితానికి అంకురార్పణ జరుగుతుంది.

ఈ జన్మ బంధాలకు తోడు గత జన్మలోని అనుబంధాలు అంతరాత్మను కల్లోలపరిస్తే! ఆత్మానుగతమైన సంఘర్షణలతో అంతరంగాన్ని అల్లకల్లోలం చేస్తే!!?

జన్మ జన్మల అనుబంధాల మధ్యన నలిగిపోయే అంతరాత్మ ఆత్మపరంగా తీసుకునే నిర్ణయమేమిటి?

తన పయనంలో నిర్దేశించుకున్న గమ్యం ఎటువైపు?

విలక్షణమైన కథనంతో - వినూత్నమైన పంథాతో - డా. కె.వి.కృష్ణకుమారి అభిమాన పాఠకులకు అందిస్తున్న అరుదైన, అమూల్యమైన రచన ''సశేషం''

Write a review

Note: HTML is not translated!
Bad           Good