అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించి, బళ్ళారిలో న్యాయవాదిగా తాడిపత్రి (బళ్ళారి) రాఘవ స్థిరపడ్డాడు. విభిన్న భాషలలో దాదాపు అరవై నాటకాలలో పాత్రలు పోషించాడు. నటనలో శాస్త్రీయతకు, అభినయానికి ప్రాధాన్యతనిచ్చాడు. మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, బెర్నార్డ్‌షా తదితరుల మన్ననలు అందుకొన్నాడు. నాటకరంగ అధ్యయనానికి పాశ్చాత్య దేశాల్లో పర్యటించాడు. భారతీయ నాటకరంగ ప్రాశస్త్యాన్ని దేశవిదేశాల్లో చాటిచెప్పాడు.

నాటకరంగ పురోగతి కోసం దేశమంతటా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. వ్యాసాలు రాసాడు. నాటకం సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించాలని, స్త్రీల పాత్రలు స్త్రీలే ధరించాలని, సంచార నాటకశాలలు ఏర్పాటు చేయాలని తదితర మౌలికమైన అభిప్రాయాలు తెలిపి, విస్తృత ప్రచారం చేశాడు.

సాంఘిక దురాచారాలను రూపుమాపి సంస్కరణభావాలను పెంపొందించడానికి జీవితమంతా కృషి చేస్తూ, తాను స్వయంగా ఆచరించి ఆదర్శంగా నిలబడ్డాడు.

బళ్ళారి రాఘవ నటుడుగా జనవ్యవహారములో ప్రసిద్ధి. నాటక రచయిత కూడా అనే విషయం వెలుగులోకి రాకుండా పోయింది. బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, స్త్రీ స్వేచ్ఛ, సాంఘిక దురాచారాలు తదితర అంశాల ఆధారంగా 1933లో ''సరిపడని సంగతులు'' అనే గొప్ప సాంఘిక నాటకాన్ని జన వ్యవహార భాషలో రాశాడు. ఈ నాటకం సామాజిక బాధ్యత కలిగిన సృజనకారుడిగా బళ్ళారి రాఘవను నిలబెడుతుంది.

పేజీలు : 86

Write a review

Note: HTML is not translated!
Bad           Good