అనగనగ పడమర ఒక పెద్ద పట్టణంలోని సంగతి. చలికాలం ప్రారంభమయింది. రామకృష్ణ పరమహంసగారి శిష్యుడొకాయన ఏదో ఒక మహత్కార్యానికై చందాల వసూళ్ళకని వచ్చాడు. దానికై ఒక సభ ఏర్పాటు చెయ్యాలనీ, ఆ సభకు ఉపేంద్రబాబుగారిని అధ్యక్షులుగా వుంచాలనే తలంపుతో ఒకనాడు వుదయాన్నే కాలేజీ విద్యార్థులు కొందరు అతని దగ్గరకు వచ్చి కూర్చున్నారు.

''అయితే ఆ మహాత్కార్యం ఏదో కొంచెం చెబుదురూ!'' అన్నాడు ఉపేంద్రుడు.

''అదే ఇంకా ఏమీ తెలియదు. అందుకే ఈ సభ ఏర్పాటు చేసేది. సభలో స్వామిగారే విషయమంతా విపులంగా ముచ్చటిస్తారట'' అన్నారు విద్యార్థులు.

ఉపేంద్రుడు ఇంకేం ఎదురు ప్రశ్న వెయ్యకుండా అంగీకరించాడు. అలా అంగీకరించటం అతనికి అలవాటైపోయింది. విశ్వవిద్యాలయ పరీక్షలన్నీ ఘనతగా పాసయిన తాను, విద్యార్థి ప్రపంచంలో మాన మన్ననలకు పాత్రుడైనాడు. ఆ సంగతి అతనికి తెలుసు. అందుకనే వారికి ఏ అవసరం వచ్చినా ఉపేంద్రుడు మాట కాదనలేదు. విశ్వవిద్యాలయ సరస్వతికి కృపాపాతృడైన  తర్వాత, న్యాయాలను లక్ష్మీని సేవిస్తున్న పిల్లల జిమినాస్టిక్‌ దగ్గరనుండి ఫుట్‌బాల్‌, క్రికెట్‌, డిబేటింగు క్లబ్బులలోని వున్నత స్థానాలన్నీ అతనికే ప్రాప్తిస్తుంటాయి. కాని ఇవ్వాళ వీరు అధ్యక్షత వహించమంటూ వచ్చి సభలో ఇదివరకటి వాటిలోలాగ వూరికనే కూర్చుంటే కుదరదు. ఏదైనా కొంత మాట్లాడటం అవసరం. ఒక విద్యార్ధి నుద్దేశించి ''సభకు వచ్చిన తరువాత ఏదైనా మాట్లాడవలసి వస్తుంది. సభ వుద్దేశమేమిటో తెలియకుండా అధ్యక్షత వహించటం ఎలాగో నాకేం బోధపడటంలేదు'' అన్నాడు.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good