పేరడీ వంటి సరికొత్త ప్రక్రియలే గాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను చేపట్టి జెగజెట్టి అనిపించుకున్నారు జలసూత్రం రుక్మినీనాథ శాస్త్రి. ఆయన పాడింది పాటగా, పలికింది చెణుకుగా తెలుగునాట చెలామణి అయింది. 1946 నుంచి వివిధ పత్రికలలో ప్రచురితమైన జరుక్‌ శాస్త్రి కథలను సేకరించి, సంపుటిగా అందించే ప్రయత్నమే 'శరత్‌ పూర్ణిమ'.

ఇది జరుక్‌ శాస్త్రి కథల దొంతి

ఇందులో ప్రతి కథా ఓ ముద్దబంతి.

జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 1914 సెప్టెంబర్‌ 7న బందరులో జన్మించారు. స్వయంకృషితో సంస్కృతాంధ్రాలలో పాండిత్యాన్ని, ఆంగ్లవాజ్ఞయంలో పరిచయాన్ని గడించారు.

కృష్ణాపత్రికలో తరచుగా వ్యాసాలు వ్రాస్తూ ముట్నూరి వారి దర్బారులో ప్రముఖ స్ధానాన్ని సంపాదించుకున్నారు. ఆంధ్రపత్రిక, వాణి పత్రికలలో సంపాదక వర్గ సభ్యులుగా కొంతకాలం పనిచేశారు. 1968 జూలై 20న హృద్రోగంతో ఆయన కన్నుమూశారు

Write a review

Note: HTML is not translated!
Bad           Good