'నవ్య' వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'మనమీదేనర్రోయ్' శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది.
ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావుఆరి 'నామీదేనర్రోయ్' అనే మాటలో ఒక్క 'నా' అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగింది.
మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యం దోబూచులాడే చమత్కారాలు, ప్రవర్తనలు, చిన్న చిన్న సమస్యలు, ఈతిబాధలు - అన్నింటినీ సుతారంగా మీటుతూ సహజత్వానికి తగు మోతాదులో హాస్యాన్ని జోడించి గీసినవే ఈ కార్టూన్లు.
'మా ఇంట్లో జరిగేవి మీకెలా తెలుస్తున్నాయి?!' అని ఆశ్చర్యపోయేవాళ్లు కొందరైతే, ఆ పాత్రల్లో తమను చూసుకుని భుజాలు తడుముకునేవారు కొందరు. చివరకు హాస్యానిదే విజయం!
మన తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు, చైనానేత మావోగారి మీద చిన్న పుస్తకం రాశారు. దానిని పంచుతూ
బెజవాడలో ప్రెస్మీట్ పెట్టారు. 'ఈ పుస్తకం నేనెందుకు రాశానో చెప్పుకోం'డని సవాల్ విసిరారు. పాత్రికేయులు రకరకాల జవాబులు చెప్పారు. చివరకు అయ్యదేవర కురచగా నవ్వి, మీరెవ్వరూ సరిగ్గా చెప్పలేదు. 'నలుగురూ చదువుకుంటా'రని రాశానని గుట్టు విప్పారు! వడ్లగింజలో బియ్యపుగింజ అంటే యిదే. నవ్య వీక్లిలో వచ్చిన యీ కార్టూన్లని, మళ్ళీ ఎందుకు పుస్తకంగా వేశారంటే - మళ్ళీ నవ్వుకుంటారని.. ఒక చోట పడుంటాయని.. - శ్రీరమణ
Rs.120.00
In Stock
-
+