'నవ్య' వారపత్రికలో పదకొండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన 'మనమీదేనర్రోయ్‌' శీర్షిక అప్రతిహతంగా సాగుతూ పన్నెండవ ఏట అడుగు పెడుతోంది.

ఈ శీర్షికకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచన వచ్చినపుడు 'హాస్యబ్రహ్మ' భమిడిపాటి కామేశ్వరరావుఆరి 'నామీదేనర్రోయ్‌' అనే మాటలో ఒక్క 'నా' అక్షరాన్ని మార్పుచేసి ఈ పేరు పెట్టడం జరిగింది.

మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యం దోబూచులాడే చమత్కారాలు, ప్రవర్తనలు, చిన్న చిన్న సమస్యలు, ఈతిబాధలు - అన్నింటినీ సుతారంగా మీటుతూ సహజత్వానికి తగు మోతాదులో హాస్యాన్ని జోడించి గీసినవే ఈ కార్టూన్లు.

'మా ఇంట్లో జరిగేవి మీకెలా తెలుస్తున్నాయి?!' అని ఆశ్చర్యపోయేవాళ్లు కొందరైతే, ఆ పాత్రల్లో తమను చూసుకుని భుజాలు తడుముకునేవారు కొందరు. చివరకు హాస్యానిదే విజయం!

Pages : 212

Write a review

Note: HTML is not translated!
Bad           Good