నవ్వు పూల గుత్తి
'ఎలాగో అలా జీవించేస్తే చాల్లే..ఓ పనైపోతుంది' అన్నట్టుగా కాకుండా 'ఆనందాన్ని అన్వేషిస్తూ ఆస్వాదిస్తూ జీవించాలి' అనుకునేవారికి ఈ ప్రపంచం ఓ నవ్వుల గని! వారికి బాధల కొనల్లో కూడా నవ్వులు చిగురిస్తూ కనిపిస్తాయి. ఆనక చిగుల్లోంచే మొగ్గలూ, పువ్వులూ పూస్తాయి. అలా మన చుట్టూ పూసిన రకరకాల వువ్వుల్ని కోసి, గుది గుచ్చి, వాటి పరిమళాల్ని మీ కందించాలన్న ప్రయత్నమే ఈ పుస్తకం!

లాభం, లోభం, లౌక్యం, చాకచర్యం, సరసం, విరసం, ఆత్మస్తుతి, పరనింద, వాంఛలూ, వరాలూ, చమత్కారాలూ, చేతకానితనాలు, ఉరుకులూ, పరుగులూ, అహంకారాలూ, ఆకలి కేకలు, ఆందోళనలూ, అపశ్రుతులు - ఒకటేమిటి, తెల్లారేస్తే వందలూ వేల అనుభవాలు! ఆ అనుభవాల తెలరల్లోంచి పుట్టిన హాస్యం సహజంగా ఉండటమే కాదు, తెలుగంత కమ్మగా కూడా వుంటుంది!

అది రుచి చూడాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే! దీన్ని సాంతం చదివితే జీవితాంతం మిమ్మల్ని గిలిగింతలు పెడుతూ మీ వెంటే వుంటుంది! ఒట్టు!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good