అలకలూ, ఆనందాలూ; ఇల్లాళ్లూ, ఈతి బాధలూ; ఉట్టి కెగరలేని వాళ్ళు, ఊసుపోని వాళ్ళు; ఎత్తిపొడిచే వాళ్ళూ, ఏడవ లేక నవ్వే వాళ్లూ; ఐ లవ్యూలూ; ఆటలూ, పాటలూ; సంగీత కచేరీలూ, సాహిత్య సభలూ, పెళ్ళిళ్ళూ, పేరంటాలూ, పోలీసులూ, ట్రాఫిక్‌ జాములూ, రైళ్ళూ, బస్సులూ, టీవీలూ, ఠీవీలూ; సినిమాలూ, షికార్లూ, బడాయిలూ, లడాయీలూ...ఒకటా రెండా! ఒకరా ఇద్దరా! అన్నీ, అందరూ కలిసి కూడబలుక్కుని, దండ గుచ్చినట్లు ఈ పుస్తకంలో చేరారు. వారు పలికితే చాలు నవ్వు పువ్వులు రాలుతాయి. రండి మరి, పలకరిద్ధాం!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good