శారద (సుబ్రహ్మణ్యయ్యర్ నటరాజన్)
తెలుగువాడు కాని తెలుగు రచయిత. ‘‘శారద’’ కలం పేరుతో రచనలు చేసిన ఎస్.నటరాజన్ తమిళుడు. పుదుక్కోటైలో 1925 ఫిబ్రవరిలో పుట్టాడు. తల్లి భాగీరథి, తండ్రి సుబ్రహ్మణ్యయ్యర్.
మాతృభాషగాని భాషమీద పట్టుసాధించి దిట్టమైన రచనలు చేశాడు. రచయితగా జీవించిన పదేళ్ల కాంలో వందకుపైగా కథలు, అరడజనుకు పైగా నవలలు రాశాడు. వారి రచనల్లో నవరసాలు జాలువారాయి. శారద పుస్తకాల్నే కాదు సమాజాన్ని చదివాడు. అంతేనా, ప్రపంచాన్నీ చదివాడు.
ఒక కథలో తనే చెప్పినట్టు శారద రచనకు లక్ష్యం ఉంది. ‘‘మనం మన పూర్వీకుల్ని ఒక్కసారి తల్చుకుందాం. వాళ్ళు కష్టపడి నిర్మించిన సంస్మృతులకూ నాగరికతకూ చిహ్నాలుగా మిగిలిన మనం, వారు సంకుచిత స్వార్ధలతోనూ అర్థరహిత ఆవేశాలతోను కల్పించిన యుద్ధాల్నీ, మానవ హత్యాకాండల్నీ విస్మరించుదాం? భావి సంతతులకూ, అలాంటి ప్రేరణలను కలగనీయకుండా ఉన్నత మానవత్వాన్ని నేర్పుదాం: భవిష్యత్తు ఆశాజనకమై భూలోకాన్నొక స్వర్గథామం చేయగమని విశ్వసిద్దాం’’.
పేజీు : 400