ప్రజాస్వామిక హక్కుల కోసం మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల మౌనంగా వేస్తున్న పొలికేక!
మణిపూర్‌కు చెందిన ఇరోమ్‌ షర్మిల ఒక సామాజిక కార్యకర్తేగాక కవయిత్రి కూడా.  గత 15 సంవత్సరాలుగా ఆమె నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు.
1958లో భారత ప్రభుత్వం 'సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల' చట్టాన్ని అమలులోకి తెచ్చింది.  1980లో దీనిని మణిపూర్‌లో అమలుపరుస్తున్న నాటి నుండి సాయుధ బలగాలు పౌరులపై తీవ్రవాదులనే నెపంతో విచక్షణారహితమైన దాడులు చేస్తున్నాయి.  2000 సంవత్సరంలో మే నెల 2వ తేదీన సాయుధ దళాలు ఇంఫాల్‌ (మణిపూర్‌ రాజధాని) బస్టాండ్‌లో 10 మంది పౌరులను విచక్షణా రహితంగా కాల్చిపారేశాయి.  ఆ పదిమందిలో ఒక వృద్ధురాలూ, 1988లో జాతీయ బాలవీరుల అవార్డు అందుకున్న 18 ఏళ్ళ బాలిక సినం చంద్రమణి వున్నారు.  కవయిత్రి, సామాజిక కార్యకర్త అయిన ఇరోమ్‌ షర్మిల ఈ సంఘటనకు తీవ్రంగా స్పందించి ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ 3వ తేదీ నుండి నిరాహారదీక్ష ప్రారంభించారు. అప్పటికి ఆమె వయసు 28 సంవత్సరాలు.  ఆమె 14 మార్చి 1972లో జన్మించారు. 
ప్రభుత్వం వారు వెనువెంటనే ఆత్మహత్యా నేరంపై షర్మిలాను నిర్బంధించారు.  ఆమె ఈ 15 ఏళ్ళ కాలంలో కోర్టు తీర్పుల కారణంగా చాలాసార్లు ప్రభుత్వం విడుదల చేసి మరల రెండు మూడు రోజుల్లో నిర్బంధిస్తూ వున్నారు.  ఆమె నిరాహారదీక్షను భగ్నం చేస్తూ ప్రభుత్వం ద్రవరూప ఆహారాన్ని ముక్కు ద్వారా అందిస్తూ వున్నారు.  నిజానికి ఇంత సుదీర్ఘకాలం నిరాహారదీక్ష చేసినవారు ప్రపంచంలోనే లేరు.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good