'నా శవంమీద ఎర్రజెండా కప్పడం మాత్రం మర్చిపోకండని మరీమరీ అభ్యర్థించాను' అంటూ వీలునామా రాసి విప్లవరచయితలతో ఎర్రజెండా కప్పించుకున్న వీరబిడ్డడు శ్రీశ్రీ.

    ''ఎర్రజెండా- దేశంమీద మెరిస్తే / ఆ పోరుగడ్డకు / చావులేదని

    ఎర్రజెండా- దేహం మీద పరిస్తే / ఆ వీరబిడ్డడు / చావలేదని'' 

    అందుకే వీర బిడ్డడు శ్రీశ్రీ చావలేదు- ఆ పోరు బిడ్డడు శ్రీశ్రీకి చావులేదు.

    తొలిసంజెలో ఉదయించాడు, మలిసంజెలో అస్తమించాడు! కవి సూర్యుడు శ్రీశ్రీ. సూర్యుడికి-ఉదయాస్తమయాలే తప్ప, జననమరణాలుండవు! అయినా మహాకవి అస్తమయంతో ప్రపంచంలో గుండెతడికాని తెలుగువాడు లేడు. అన్ని  వెలుగు పత్రికలూ హెడ్‌లైన్లతో, రెడ్‌లైన్లతో భోరుమన్నాయి. అన్ని తెలుగు పత్రికలు తమ సంపాదకీయాలను సంతాపకీయాలుగా వెల్లువెత్తాయి. తెలుగు అక్షరం కన్నీరు దేశంలో నాలుగో మున్నీరై పోటెత్తింది. ఇది తెలుగు పత్రికా చరిత్రలో చరిత్ర. శ్రీశ్రీ చరిత్ర. అలా వెల్లువెత్తిన 34 పత్రికాసంతాపకీయాలు ఈ సంపుటి. ఇందులో దిన, వార, పక్ష, మాస, త్రైమాస, ప్రత్యేక సంచికల సంతాపకీయాలు చోటుచేసుకున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good