పేర్లు చెప్పండి, లోపలికి రండి' అంటూ నిలవరించింది.

'ఆటోరాణి' అన్నాడు కిరణ్‌.

వదిన వైపు చూసింది ఆర్తి. 'శంకర్‌ దాదా' అన్నది ఆమె.

ఫక్కున నవ్వి, పొలమారటంతో నెత్తిమీద గట్టిగా చరుచుకున్నాడు మస్తాన్‌ భాయి. 'ఈ ఇల్లు ఇరుకయిపోయినట్లుంది. మన షెడ్‌కి మనం వెళ్ళిపోదాం' రహస్యంగా అతని చెవిలో చెప్పాడు చెంచునాయుడు.

అమెరికా నుండి వచ్చిన నంజుండస్వామి, కొడుకు, కోడలు, చుట్టాలు, పక్కాలు, స్నేహితులు అందరితో కిటకిటలాడిపోతోంది. ఆ బంగ్లా.

తమ రేకుల షెడ్‌కి వెళ్ళారు. తాళం వేసిన తలుపులు ఓరగా తెరిచి వుండటంతో, చెంచునాయుడిని బయటే కూర్చోబెట్టి మెల్లిగా ముందుకు వచ్చాడు మస్తానుభాయి.

'రేయ్‌ మస్తానూ, ఇక్కడ ఏదో ఒక ఆటో ఆగివుందిరా, మనం వచ్చింది కాదు. ఇంకెవరో వచ్చినట్లున్నారు' వెనుక నుండి వినవచ్చింది. చెంచునాయుడి కంఠం. తలుపుల దగ్గర నిలబడి లోపలికి చూసి, ఎంత నిశ్శబ్దంగా అక్కడి వచ్చాడో, అంతే నిశ్శబ్దంగా వెనక్కి తిరిగాడు మస్తాను భాయి. 'ఇల్లు ఇరుకయింది మనకే కాదు. మనవాడికి కూడా అలాగే అనిపించింది. ఆ ఆటో పిల్లతో సహా వచ్చి మన మంచం మీద తిష్ఠవేశాడు'. లోగొంతుకతో తన ఫ్రెండ్‌కి చెప్పాడు.

000

ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ కొడుకు అనాథ అవడం, కూతురు విలన్‌ దగ్గర పెంచబడటం అనే కాన్సెప్ట్‌ నేపథ్యంలో, ఒక మామూలు క్రైమ్‌ స్టోరీకి అనుబంధాలను, ఆప్యాయతలను హైలైట్‌ చేయవలసిన అవసరాన్ని గుర్తించి, మస్తాన్‌భాయి, చెంచునాయుడు, రాంబాయి, నంజుండస్వామి, యామిని మేడమ్‌ పాత్రల్ని కల్పించి - ఏకబిగిని విడవకుండా చదివించేలా ఈ నవలను రెండవభాగంతో ముగించారు మధుబాబు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good