ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు తొలి ముద్రణ జరిగి దాదాపు 110 సంవత్సరాలు పూర్తయింది. ఈ సుదీర్ఘకాలంలో ఈ నిఘంటువు పలు రూపాలలో పలుసార్లు పునర్ముద్రితమైంది. పలు చేర్పులు - మార్పులకు లోనైంది. ప్రయోజనం కూడా తగినం పెరిగింది. ఈలోగా 20వ శతాబ్ధి తుది పాదంలో ముఖ్యంగా తెలుగు అకాడమీ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొదలైన సంస్ధలు పనిచేయడం ప్రారంభించాక తెలుగు భాష వాడుకపై విస్తృతి పెరిగింది. ఈ సంస్ధలు గతంలో ఉన్న పదాలకు కొన్నింటిని సవీకరించాయి. పలు నూతన పదాలు సృష్టించాయి.
ఈ ప్రయత్నాలు మీడియా తెలుగు భాషా ప్రగతికి తోడ్పడ్డాయి. బడు, యొక్క మరియు - మొదలైన అక్షరాల వాడుక బాగా తగ్గించి వేశాయి. అలాగే చే, జే, లు శకటరేపు వాడుక దాదాపు తగ్గిపోయింది.
ఈ పరిస్ధితుల దృష్ట్యా శంకరనారాయణ ఇంగ్లీషు - తెలుగు, తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులను పరిష్కరించి పునర్ముద్రించవలసిన అవసరం ఏర్పడింది. ఈ పునుర్ముద్రణలో పలు మార్పులు చేయడం జరిగింది.
ఈ అవసరానికి అనుగుణంగా సహస్రాధిక గ్రంథాలను, చిరకాలం పదిల పరచుకోవలసిన సర్వోత్తమ గ్రంథాలను ప్రచురించిన విజయవాడలోని నవరత్న బుక్‌ హౌస్‌  వారు ముందుకు వచ్చి, ఈ నిఘంటువును సవరణలతో పునర్ముద్రించే సాహస కార్యక్రమానికి పూనుకున్నారు.
శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు సంపాదకులుగా వ్యవహరించార. శ్రీ లంకా సూర్యనారాయణ గారు, శ్రీ మాదిరాజు గోవర్ధన రావు గారు సహకర్తలుగా ఉన్నారు. వారికి అభినందనలు.
నిఘంటువు కర్త : శ్రీ పావులూరి శంకరనారాయణ గారు 

Write a review

Note: HTML is not translated!
Bad           Good