115 సంవత్సరాల నాటి నిఘంటువును, నేటి అవసరాలకు యవతకు సరిపడా ఆధునీకరించి రూపొందించినది.
యువతకు అన్ని స్ధాయిలలో అవసరమైన భాష, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన సుమారు 16 వేల పదాలకు కమ్మని తెలుగు భాషలో అర్ధ వివరణ.
కొత్తగా వాడుకలోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్లకు సంబంధించిన నూతన పదాలు తగినన్ని చేర్చడమైనది. సుమారు నాలుగు వందల పుటలలో విస్తరించిన పది అనుబంధాలు ఈ నిఘంటువునకు ఒక విశేష ఆకర్షణ.
ఆదికవి నన్నయ సమకాలికుడైన గణిత శాస్త్రవేత్త పావులూరి మల్లనకు వారసులు.
బహు భాషా వేత్త, విద్యావేత్త, చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంగ్లం, గణిత బోధకులు 1897లో ఇంగ్లీషు - తెలుగు, 1900లో తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులు సిద్ధం చేశారు.
లక్షలాది మంది యువతలో భాషా జ్ఞానం, లోకజ్ఞానం పెంపొందించిన ప్రాత:స్మరణీయులు శ్రీ పావులూరి శంకరనారాయణ గారు.
ఈ పరిస్ధితుల దృష్ట్యా శంకరనారాయణ ఇంగ్లీషు - తెలుగు, తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులను పరిష్కరించి పునర్ముద్రించవలసిన అవసరం ఏర్పడింది. ఈ పునర్ముద్రణలో పలు మార్పులు చేయడం జరిగింది.
ఈ నిఘంటువుతోపాటు సిడి కూడా అందిస్తున్నారు.
ఈ అవసరానికి అనుగుణంగా సహస్రాధిక గ్రంథాలను, చిరకాలం పదిల పరచుకోవలసిన సర్వ్తోత్తమ గ్రంథాలను ప్రచురించిన విజయవాడలోని నవరత్న బుక్ హౌస్ వారు ముందుకు వచ్చి ఈ నిఘంటువును సవరణలతో పునర్ముద్రించే సాహస కార్యక్రమానికి పూనుకున్నారు.
శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు సంపాదకులుగా వ్యవహరించారు. శ్రీ పావులూరి శ్రీనివాసరావు గారు, శ్రీ పాలడుగు వెంకట్రామయ్య గారు సహకర్తలుగా ఉన్నారు. వారికి అభినందనలు
Rs.450.00
In Stock
-
+