సంఘమిత్ర కథలు కాలక్షేపం కథలు కాదు. ఒక ప్రయోజనం కోసం, ఒక పరమార్థం కోసం, ఒక మహోన్నత సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఊపిరిపోసుకున్న కథలు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి - ఇది నానుడి. ఎక్కడ స్థూపాలు శిథిలమయ్యయో అక్కడే తవ్వుకోవాలి - ఇది చరిత్ర. ఎక్కడ సంస్కృతి కనుమరుగయ్యిందో అక్కడి పుణ్యక్షేత్రాలలోనే అన్వేషణ కొనసాగించాలి - ఇది సంఘమిత్ర కథల అంతస్సూత్రం.

సంఘమిత్ర కథల్లో కృష్ణవేణి తరంగాల్లా త్రుళ్ళిపడే తెలుగుదనం, తెలుగు శాకాలు, పాకాలు, పలుకుబళ్ళు, అతిథి మర్యాదలు, అహం లేని మనుషులు అంతరంగాలు ఈ కథలను జీవనదీ ప్రవాహంలా నడిపించాయి. ఇవి కాలానికి అతీతమైన కథలు. కలకాలం నిలిచే కథలు. భౌద్ధ ధర్మాన్ని పునరుద్దరించే బృహత్కథలు.

సంఘమిత్ర కథలు అమరావతీ శిల్పాలకు అక్షర రూపాలు!
కాల గర్భంలో కనుమరుగైన బౌద్ధ సంస్కృతిని వెలికి తీసే వెన్నెల దీపాలు!
- డా.వెనిగళ్ళ రాంబాబు

Write a review

Note: HTML is not translated!
Bad           Good