క్రీస్తు శకం ప్రారంభంలో సంగీత నిర్వచనం మారిపోయింది. శ్రుతి, రాగం, తాళం అనేవి సుశ్రావ్యంగా ఉంటేనే అది నిజమైన సంగీతం అనే దాన్ని మనం సరిగా అనుసరిస్తున్నామా? అని ఆత్మ పరిశీలన చేసుకోవలసి ఉంది.
అరవై ఏండ్ల క్రితం గ్రామఫోను రికార్డులను ప్లేచేస్తూ, దాని కనుగుణంగా నృత్యాలు చేస్తే వాటిని 'రికార్డింగ్‌ డ్యాన్స్‌  ట్రూపులు' అని తక్కువ చూపు చూపిన మనం ఈనాడు ''స్కూల్‌డే, కాలేజ్‌డే, ఫ్రెషర్స్‌డే, బర్త్‌ డే, న్యూకమర్స్‌డే, పెళ్ళిళ్ళు మొదలైన అన్ని సందర్భాలలోనూ సి.డి. ప్లేయర్లలో సినిమా పాటలకు గంతులేస్తూ ''ఇదే లేటెస్ట్‌ ఫ్యాషన్‌'' అనడం ఎంత ఆత్మవంచన అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి.
ఇలాంటి ఆలోచనలన్నిటినీ రేకెత్తింపజేసిన ఈ పుస్తకాన్ని డా.కె.వి.రావు గారు ఎంతో పరిశోధనాత్మకంగా రచించారు. రికార్డింగ్‌ పుట్టుక, దాని నేపథ్యం, స్వరూప వికాసం, సామాజిక అవసరం, సాంకేతిక విజ్ఞాన పరిణామాని కనుకూలంగా జరిగిన వినూతన కృషి, సంగీతపు విలువల పరిరక్షణ మొదలైన అంశాలన్నీ సాధికారికంగా ఈ గ్రంథంలో పేర్కొనడం గొప్ప విశేషం. హెచ్‌.యమ్‌.వి. వారి కుక్కబొమ్మ కథ, సంగీత చరిత్ర, సప్త స్వరావిర్భావం, వాటి మూలాలను చక్కగా పొందుపరిచినారు. - డా|| యం.పురుషోత్తమాచార్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good