తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

సంధ్యారాగం

బేగంపేట విమానాశ్రయం తిరునాళ్ళలా సందడిగా వుంది. బాంబే నుండి వచ్చే ప్లేన్‌ అరగంట ఆలస్యంగా వస్తుందని అనౌన్స్‌ చేశారు.

వెళ్ళేవారికి వీడ్కోలు ఇవ్వటానికి కొందరు. దిగేవారిని ఆహ్వానించటానికి మరికొందరు వచ్చి వున్నారు. ఇంకా కొందరు ఏర్‌పోర్టులో నిల్చుంటే ఏ సినిమా తార దర్శనమయినా కాకపోతుందా అని అటు ఇటు తిరుగుతున్నారు.

ఒక ఎక్స్‌ట్రా తార  యలు ఒలికిస్తూ తిరుగుతున్నది.

ఒక మూల రాయలు, కుచేలరావు, చలపతి, రాయలు కూతురు రాధ కూర్చున్నారు. అక్కడికి హడావుడిగా వచ్చింది బేబీ.

''అమ్మ ఏది నాన్నా! ప్లేన్‌ లేటట'' అన్నది తను వేసుకున్న ప్యాంటు సవరించుకుని.....

పేజీలు : 227

Write a review

Note: HTML is not translated!
Bad           Good