ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

ఒకే తల్లి కడుపున పుట్టినా, వారిని విధి వేరుచేసి వెక్కిరించింది. చెల్లెలు కలవారి యింట కనకపీఠం ఎక్కింది. అక్క అనాధగా మారి ఆ యింటికే చేరింది. వారికి తమ అనుబంధాలు మాత్రం తెలియవు. అక్కకు జీవితం ఓర్పునీ, ఓదార్పునీ, త్యాగాన్నీ నేర్పగా చెఉల్లెలికి ధనలాలసత్వం కన్నుగప్పింది. ఫలితంగా ఆమె దారి తప్పింది.

పెళ్ళి కాకుండా చెల్లెలు ప్రసవించిన శిశువును అక్క అక్కున చేర్చుకుని, నింద తనమీద వేసుకుంది. జీవితానందాన్ని తన సర్వసాన్ని ఆమెకే దారబోసింది.

తన ప్రియుడు చెల్లెలి భర్త అయినప్పుడు - తనని లోకం నిందల ఉక్కుగోళ&ఓళతో రక్కుతున్నపుడు, ఆ త్యాగమయి అన్నిటికీ భరించింది.

వెక్కిరించిన ఆ విధే కడకు ఆమెకు ఆనందాన్ని దక్కించింది.

ఏమిటా ఆనందం?

ఏమిటా త్యాగం?

ఆమె జీవిత గమనం ముళ్ళదారులు గడచి, ఆనందపు పూల లోకం జేరిన అంతరాలు ఈ సంధ్య మీకు చెపుతుంది.

Pages : 181

Write a review

Note: HTML is not translated!
Bad           Good