నేటి సమాజంలో గురువులు అంతటా దొరకుతారు. సద్గురువులు అరుదుగా దొరుకుతారు. అట్టి సద్గురువులే మాద్గురు దేవులు, పూజ్య పాదులు శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాముల వారు. 1950 లో శ్రీ కాళహస్తి నందు శ్రీ సుక బ్రహ్మశ్రామాన్ని స్థాపించారు. 1961 సం||లో 13 సంవత్సరాల వయస్సులో శ్రీ స్వామి వారి సేవకు నాకు అవకాశం కల్పించారు. స్వామివారి హృదయములో కాస్త చోటు ఇవ్వమని కోరారు. హృదయమంతా నాకే ఇచ్చారు. నా  హృదయం లో అణువణువునా వారే వున్నారు. వారి అవసరాలు ఏమైనా ఈశ్వర్ , ఈశ్వర్ అని నా  చెవిలో వేసేవారు అది నా అదృష్టం భక్తులు శ్రీ స్వామి వారిని దర్శించి వారి ఆశీస్సులు పాడేవారు. తదుపరి తీరిగ్గా, కూర్చుని వారి సందేహాలు, సమస్యలు నాతొ చెప్పుకునేవారు. గురుదేవుల ఆశీస్సులతో వారి సందేహాలకు తగిన సమాధానము చెప్పుట వలన సంతృప్తి చేదేవారు ఆనాటి నుండి ఈ నాటి వరకు అందరికి వున్నా సందేహాలను ఒకచోట చేర్చి, సమాధానాలు అందించి సంతృప్తిపరచు ఉద్దేశ్యమే సందేహాలు -సమాదానాలు అను ఈ గ్రంధము వెలువడుటకు మూల కారణం. ఈ గ్రంధం మీరు చదవండి. మీ స్నేహితులతో చదివించండి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good