సంయుక్త ఆమె కలం పేరు, ఆమె రచనలు అసహజంగా వుంటాయి, అనే అభిప్రాయం కొందరికి, చాలా సహజంగా జీవితంలాగే వుంటాయి అన్న అభిప్రాయం అరుణకి, తన అభిమాన రచయిత్రి సంయుక్త పరిచయం అరుణ సంసార జీవితంలో ఎలాంటి అల్లకల్లోలం రేపిందో తెలిపే కథ సంయుక్త.
తప్పనిసరై, రోగిష్టితల్లితో పిన్ని యింటికొచ్చింది జ్యోతి. తల్లిని దక్కించుకోలేకపోగా, ఆ యింటి నీడన అనేక రకాల అవమానాలతో బతుకు నరకమైంది. అనుకోని అదృష్టంగా సారధి చేయూత లభించింది. ఆ అదృష్టమైనా తనకి పిన్ని దక్కనిస్తుందా? అన్నదే జ్యోతి అనుమానం. అయినా వాళ్ళ ఆదరణ కరువైన ఆడపిల్ల బాధకి కథా రూపం జ్యోతి.
ప్రేమతో పెంచి పెద్ద చేసిన తాతయ్య, ఆస్తిమీద ఆయన మమకారం, తోడబుట్టిన అన్నగారు, ఆస్తిమీద అతని అపరిమిత నిర్లక్ష్యం, విభిన్న దృక్పథాలు గల వీళ్ళిద్దరి మధ్యా అందాల రాధా ప్రసాద్‌ పట్ల ఆమె అనురాగం. ముగ్ధగా, గృహిణిగా, బేలగా వో ఆడపిల్ల అనేక మజిలీలు గడిచి ప్రేమ మజిలీ చేరిన కథ రక్షణ నిధి.
'నువ్వు శారీరకంగా దూరమైనా, మానసికంగా నా దగ్గరే వుంటావు' - అన్నాడు రాజు. 'నాకు శరీరం, మనసు రెండూ ఒకటే రాజూ, ఒకరి దగ్గర శరీరం, మరొకరి దగ్గర మనసు వుంచుకునే మనిషిని కాను' అంది సుజాత. పరస్పరం అనురాగం వున్న వీళ్ళిద్దర్నీ చిత్రంగా విడదీసి, మరింత చిత్రంగా చేరువ చేసిన జీవన వైచిత్రిని తెలిపే కథ - ప్రేమ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good