ప్రజా కవి ధర్మన్న

దళిత జాతి అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితమిచ్చిన కవి ధర్మన్న. ఆయన నడకలతో గోదావరీ తీరం పునీతమయ్యింది. ఆనాడున్న అడ్డంకులను అధిగమించి 'వైద్య విద్యాన్‌' అయి ప్రజల వైద్యుడయ్యాడు; వైద్య వృత్తినే సమున్నత శిఖరాలకు తీసుకెళ్ళాడు. తన వృత్తినే కాదు. ప్రవృత్తినీ ప్రజలకంకితమిచ్చాడు. విలక్షణ గాత్రంతో ప్రజలను చైతన్యవంతులను చేసాడు. ఉత్తజపరిచాడు. సుందర మార్గాన్ని, జీవన మార్గాన్ని చూపించి దిక్చూచిగా నిలిచారు. ధర్మన్న రచనలన్నీ తోటి ప్రజల జీవితాన్ని చక్కదిద్దేందుకో! మెరుగు పరిచేందుకో! ఉత్తేజరపిచేందుకో! ధర్మన్న గేయాలు అణగారిన ప్రజల స్వరాలు.

ధర్మన్న జీవితం ఆదర్శ జీవితం! ఆచరణీయ జీవితం. పాలకుల కుటిలత్వాన్ని బట్టబయలు చేసిన ధీశాలి. మార్గదర్శకుడు. ఈనాడు ఈ ఆదర్శాలే మనకు ఆచరణీయం. అణగారిన ప్రజలకు మార్గదర్శి ధర్మన్న. అందుకే ఈ రచనలు చదవాలి.

Pages : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good