సంస్కృతం తెలుగు ఇంగ్లీషు సామెతలతో వినసొంపుగా, చమత్కారంగా మాట్లాడాలనుకునే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు, ప్రవక్తలకు ఉపయోగపడే పుస్తకం.

    మన పూర్వులు తమ జీవితానుభవాలను సూత్రాలుగా చెప్పేవారు. ఆ సూత్రాలనే సూక్తులు, ఆర్యోక్తులు, లోకోక్తులు అని కూడ చెబుతూ వుంటారు. ఇవే మన సాహిత్యంలో సామెతలు, జాతీయాలుగా వున్నాయి. చిన్న చిన్న మాటల పలుకుబడులు మనసుల్ని రంజింపజేస్తూ అద్భుత భావాలను అందిస్తాయి. పండితులనేకాక పామరులను కూడా అవి ఆనందపరుస్తాయి. అందరికీ అతి సులువుగా అర్థమయ్యే పోలికలు, ఉపమానాలు - లోకోక్తులు, సామెతలుగా అన్ని భాషల్లో అర్థమయ్యే పోలికలు.

    'సామెత జాతికి ఆమెత' (విందు). ఆలోచనల భావం, కొద్దిమాటల్లో యిమిడి వుండేవే సామెతలు. చేదుమందును పంచదారతో పొదిగి మింగించే హితోక్తులే సామెతలు. మాటకారితనానికి సామెతలు మొనగాళ్ళు. సంభాషణా చాతుర్యాన్ని మెరుగు దిద్దేవే సామెతలు. వాటి శక్తి అనంతం.

    సమత కల్గినదే సామెత. ఏదైనా ప్రసంగిస్తూ ఒక సామెతను ఉపయోగిస్తే ఆ ప్రసంగానికి కాంతిని కలుగజేస్తుంది సామెత. ఉపమానాలను పెద్దలు చెప్పిన మాటలను జోడించి సంభాషిస్తే ఆ మాటల మాధుర్యం వినసొంపుగా వుండి శ్రోతలు ఆకర్షింపబడతారు. పసిడిపలుకులవంటి పదజాలంతో, సిసలైన నుడికారంతో చెప్పిన మాటకు విలువ ఎక్కువ.

    ఈ పుస్తకం ''సంస్కృత లోకోక్తులు'' పేరుతో కెప్టెన్‌ ఎం.హెచ్‌.కార్‌ 1868లో అంటే 147 ఏళ్ళ క్రితం రాసి ప్రచురించింది. అప్పటికీ యిప్పటికీ సాహిత్యంలో ఎంతో మార్పు వచ్చింది. కనుక ఈ కాలానికి పనికిరాని కొన్ని సామెతలను పరిహరించి నేటికీ మేటిగా నిలవగలిగిన 400కి పైగా సంస్కృత సామెతలను ఎంపికచేసి వాటికి సరిసమానమైన తెలుగు సామెతను లేదా భావాన్ని ఇందులో చేర్చాము. - పి.రాజేశ్వర రావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good