శ్రీ గాయత్రీ మహిమ

శ్రీ గాయత్రీ పరదేవతాయై నమ:. ఆసేతు శీతాచల మధ్యవర్తి యగు మన భరత భూమి యందు విప్రులలో శ్రీ గాయత్రీ పరదేవతను గురించి యే కొంచెమైననూ ఎరుగని వారొక్కరైన నుండరనుట సాహసోక్తి కానేరదు. ఉపాస్య దైవములలో సుత్తమోత్తమ దైవతము శ్రీ గాయత్రీ పరదేవత.

ఆధ్యాత్మిక దృష్టి కలవారు ఏదో నొక దేవతామూర్తిని ఉపాసించుట సర్వజన విదితమగు నంశము. ఆయా దేవతల నుపాసించువారు తమకుపాస్యమైన దేవతలను భక్తితో నారాధించుచూ తన్నామముల గీర్తించుచూ తద్గుణాతిశయముల సంస్మరించుచూ, తన్మాహాత్మ్యముల సంస్తవ మొనర్చుచూ తదేకాయత్త చిత్తులై పూతాంత: కరుణలై క్రమముగ విమలమగు తత్వజ్ఞాన సంపత్తి కలవారై వర్తించుచుందురు.

అట్టివారు అనేక వర్గములకు చెందినవారు మన భరతభూమిలో కలరు. వారిలో శైవులు, వైష్ణవులు, గాణాపత్యులు, సౌరులు, శాక్తులు అనువారుముఖ్యులు వీరు వరుసగా శ్రీ సదాశివుని, శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాగణాధిపతిని, శ్రీ సూర్యభగవానుని, శ్రీ పరాశక్తిని దైవముగ కొల్చుచుందురు.

వీరిలో నొకరి దేవునియందు వేరొకరికి భక్తి ప్రపత్తులుండవు. మనదేశములో మొదట రెండు వర్గముల వారికే (శైవులు - వైష్ణవులు) విశేష వ్యాప్తి గలదు. శివునికంటే నన్యమగు దేవునుపాసించు వారికి ముక్తి కలుగనేరదని శైవులందురు. ఇట్లు పరస్పర విరుద్దాభి నివేశములు గల ఉభయ వర్గముల వారునూ శ్రీ గాయత్రీ మంత్రమునే ఉపదేశము పొందుదురు. అంతట నుండి యావజ్జీవము ''అహరహ స్సన్ద్యాముపాసీత'' అనెడి శ్రుతి విధములు. ఆ అన్నిటియందును గాయత్రీ ఛందస్సు ముఖ్యము. అది మొదటి ఛందస్సు యొక్క అనుబంధము మిగిలిన అన్ని ఛందస్సులలోను గలదు. కాన నీ పరదేవత సర్వదేవానుగత మగుచున్నది. అందువలన నీ దేవత ముఖ్యతమము....

Write a review

Note: HTML is not translated!
Bad           Good