'సంస్కరణల రథసారధి పివి'లో ప్రధానమంత్రి కీలక సహాయకుడు, ఆయన కార్యాలయంలో పనిచేసిన జైరాం రమేశ్‌ తొలి వారాల్లో వేగంగా మారుతున్న మార్పులను రికార్డు చేశారు. తొలి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా కోలుకున్నదో ఆయన తనదైన శైలిలో అభివర్ణించారు. భారతీయ ఆర్థిక విధాన రూపురేఖలు సమూలంగా మారే దశలో వచ్చిన ఒత్తిళ్లు, ఉత్థాన పతనాలు, మలుపులను ఆయన ఆసక్తికరంగా వివరించారు.

ఒక లోతైన దృష్టితో రచయిత రచించిన రసవత్తర కథనమే కాక ఈ పుస్తకంలో మొదటి సారి కీలకమైన పత్రాలు, నోట్స్‌ బహిరంగంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. పివి వ్యక్తిగత పత్రాలు, మన్మోహన్‌ సింగ్‌తో ప్రైవేట్‌ సంభాషణలు, పార్లమెంట్‌లో జరిగిన చర్చలు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి చెందిన మినిట్స్‌ కూడా మనకు ఈ పుస్తకంలో లభ్యమవుతాయి. భారత దేశ ఆర్థిక సరళీకరణ రజతోత్సవ సమయంలో వెలువడిన ఈ పుస్తకం కుప్పకూలిపోతున్న దశ నుంచి ఒక దేశం ఎలా కోలుకుని అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదో చెప్పే ఒక రాజకీయ, ఆర్థిక చరిత్ర.

Pages : 234

Write a review

Note: HTML is not translated!
Bad           Good