శ్రీమతి సుజాత పట్వారికి కన్నడ, తెలుగు భాషా సంస్కృతులు రెండింటిలోనూ మంచి పరిజ్ఞానం ఉండటం వల్లా, అనువాదం చేయడంలో తగిన సామర్ధ్యం ఉండటం వల్లా, ఈమె అనువాద నవల 'సంస్కారం' అత్యంత పఠనీయంగానూ, ప్రశంసనీయంగానూ ఉంది. - అబ్బూరి ఛాయాదేవి

సంస్కారం

వడలిపోయి ఎండుపుల్లలా వున్న భగీరథి దేహానికి స్నానం చేయించి, ఉతికిన చీరెను చుట్టబెట్టాడు ప్రాణేశాచార్య. రోజులాగే దేవుడికి సమర్పించిన పూలను ఆమె తలలో తురిమాడు. ఆమెకు తీర్థాన్నిచ్చాడు.

ఆమె అతని పాదాలు తాకింది. అతను ఆశీర్వదించాడు.

తర్వాత ఆమెకి ఓ గిన్నె నిండుగా గోధమ గంజి తెచ్చిచ్చాడు ప్రాణేశాచార్య.

''ముందు మీది కానివ్వండి'' అంది భగీరథి.

''లేదు...లేదు...ముందు నీదవ్వనీ'' అంటూ గిన్నెను ఆమె నోటికందించాడు.

ఇరవయ్యేళ్ళుగా వాళ్ళ దినచర్యలో భాగమైపోయాయి ఈ మాటలు. వేకువ స్నానంతో సంధ్యవార్చడం, వంట, భార్యకు మందులు...నది దాటి మారుతి ఆలయం చేరి చేసే పూజలు...ఇదీ క్రమం తప్పని ప్రాణేశాచార్య దినచర్య.

భోజనాల తర్వాత అగ్రహారంలో వున్న బ్రాహ్మణులంతా ఒక్కరొక్కరుగా ఆయన ముంగిట్లోకి చేరిపోతారు. పొద్దు పోయేవరకు ఆయన చేసే పురాణ, భాగవత పఠనం వారికీ ఆయనకీ, రోజు రోజుకీ కొత్తగానూ మరింత మధురంగానూ అనిపిస్తుంది. సాయం వేళల్లో మరోసారి స్నానం, సంధ్యవార్చడం, రాత్రి భార్య కోసం జావకాయడం, భార్యతో తనూ ఇంత ఎంగిపి పడ్డం...మళ్ళీ పొద్దు పోయేంతవరకూ రాత్రి పురాణ కాలక్షేపం- అప్పుడు కూడా వసారా నిండుగా బ్రాహ్మణులు కూర్చొని వింటారు. అప్పుడప్పుడూ భగీరధి అనేది-

''నన్ను పెళ్ళి చేసుకున్నందుకు మీకేమాత్రం సుఖాన్నివ్వలేకపోయాను. ఇంటికి పిల్లలే శోభ. మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోండి''.

''ఈ ముసలి వాడికి మళ్లీ పెళ్ళా? గట్టిగా నవ్వేశాడు ప్రాణేశాచార్య.

''మీ వయసెంతనీ, మీరు ముసలి వాళ్ళు కావడానికీ? నలుబదిలోనైనా పళ్లేదింకా. ఏ ఆడపిల్ల తండ్రయినా కళ్లకద్దుకుని మరీ మీకు కన్యాదానం చేస్తాడు. మీలాంటి పండితుడికి, పైగా కాశీలో సంస్కృతం అభ్యసించిన మీకు పిల్లనివ్వడం వాళ్ల అదృష్టంగా భావిస్తారు. చిన్న పాదాలు పారాడని ఇల్లు ఇల్లే కాదు. నావలన మీకెలాగూ ఏ సౌఖ్యమూ లేదు. దయచేసి మళ్ళీ....''............

Write a review

Note: HTML is not translated!
Bad           Good