భానుమతి కృష్ణ ప్రసాద్ లది ఒద్దికైన కాపురం. వాళ్ళ అన్యోన్య దాంపత్య ఫలమే సునీత. కృష్ణ ప్రసాద్ తన స్నేహితుడు చనిపోతే అతని భార్య సత్యవతిని ,కోడును కిరణ్ నీ ఇంటికి తెచ్చి ఆదరించాడు. సునీతని కిరణ్ కిచ్చి చేయాలనుకున్నాడు. అంతా ఒప్పుకున్నారు. అయితే భానుమతి ఓ నాటి చిన్న సంఘటనతో మనసు మార్చుకుంటుంది. భర్తని అనుమానిస్తుంది. కృష్ణప్రసాద్ మంచిదనుకుని చేసిన పనే అతడి జీవితానికి కొరివి ఆయికూచుంది. ఇద్దరి మనసులూ విరిగిపోయాయి. ఆ పరిథితుల్లో కృష్ణ ప్రసాద్ చెయగలిగిందేమిటి ? ఒకరినొకరు దగ్గరైన సునీత, కిరన్ల భవిస్యత్తు ఏమిటి ?
భానుమతి కంపిస్తున్న స్వరంతో అంది " నువ్వు -నువ్వు - సునీతను పెళ్లి చేసుకుంటాననటం, నీ చెల్లెల్ని చేసుకోవటమే అవుతుంది. కిరణ్
ఛీ ఆటను చీత్కారం చేశాడు.
ఛీ ఏమిటి అంటీ మీ మాటలు ? సునీత నాకు చెల్లెలు ఎలా అవుతుంది ?
"సునీత తండ్రికి మరో స్రీ తోసంబంధం వుంటే, ఆ శ్రీ కొడుకు సునీతని పెళ్లి చేసుకున్తాంటే, ఆ అబ్బాయికి సునీత ఏమవుతుందో, ఆ చుట్టరికానికి నువ్వేం పేరు పెడతావో చెప్పు " అతని మొఖం వెలవెలా బాయింది.
ప్రతి పంక్తి రసభరితంగా శ్రీమతి సులోచన రాణి మలచిన నవల సంసార రధం .

Write a review

Note: HTML is not translated!
Bad           Good