అర్వీటి వంశస్థుడైన వేంకట చలపతి దేవరాయల అన్న కుమారుడు శ్రీ రంగరాయులు. అతని తండ్రి చిన్ననాడే చనిపోవడంతో వేంకటాచలపతి నామమాత్రపు రాజుగా వ్యవహరిస్తూ శ్రీ రంగడే భవిష్యత్‌ సామ్రాట్‌ అని భావిస్తూ రాజ్యాన్ని పాలిస్తుంటాడు.

కానీ, తన నాలుగవ భార్య కొండమాంబిక మాత్రం శ్రీ రంగరాయలు సామ్రాట్‌ కావడం సహించలేకపోయింది. శ్రీవేంకటేశ్వరుని సమక్షంలో తనకు ఒకవేళ పుత్రోదయం జరిగితే అతన్నే రాజును చేయాలని భర్తను కోరుతుంది. దానికి వేంకటాచలపతి అంగీకరిస్తాడు.

కొండమాంబిక అన్న అయినటువంటి జగ్గరాజుకు, రాజనర్తకి మంజరికి కలిగిన అక్రమ సంతానాన్ని కొండమాంబికకు పుట్టినట్లుగా ప్రపంచాన్ని నమ్మిస్తాడు జగ్గరాజు. తద్వారా ఆ సంతానాన్ని భవిష్యత్‌ సామ్రాట్‌ను చేయాలని అతని విశ్వప్రయత్నము. అతని ఈ ప్రయత్నం ఫలించిందా? లేక శ్రీ రంగరాయలే రాజయ్యాడా?

తెలుసుకోవాలంటే ఈ చారిత్రక నవల చదవాల్సిందే.

పేజీలు : 141

Write a review

Note: HTML is not translated!
Bad           Good