'నాకు అర్థం కావటం లేదు'' అన్నాడు వేణు. ఆమె ఎందుకలా ప్రవర్తించిందో.. అంత చనువు ఎందుకు ప్రదర్శించిందో''.

''నాకు నిన్న రాత్రి అర్థం కాలేదు. కానీ రాత్రి రూమ్‌కొచ్చాక ఆలోచిస్తే అర్థమయింది'' అన్నాడు ప్రసాదరావు.

''ఏమిటి?''

''ప్రసాద్‌తో గొడవవల్ల ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మనుష్యులు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ చిన్న ఆధారం దొరికినా చాలనుకుంటారు. నిన్న రాత్రి అది కలిసొచ్చింది. ఇక కథ క్లయిమాక్స్‌కి వచ్చేసినట్టే''.

...

తన చెల్లెలి జీవితంతో ఆడుకున్న సర్‌ జగపతిరావు బహదూర్‌ అనేవాడి మీద పగతీర్చుకునే నిమిత్తం..

ప్రసాదరావు అనే కౌటిల్యుడిలాంటి వృద్ధుడు జీవితంలో ఎప్పుడూ అబద్ధమాడని వేణు అనే అందమైన కుర్రవాడిని నియమించాడు.

వాళ్ళ కాంట్రాక్టు ప్రకారం జగపతిరావు కూతుర్ని ప్రేమలోకి దింపి, ఆమెను గర్భం వచ్చాక వదిలెయ్యాలి. వేణు రంగంలోకి దిగాడు. దిగాక తెలిసింది. - చూస్తే నాలుగు పెదవుల కలయిక చాలా సులభం, ఆలోచిస్తే రెండు మనసుల కలయిక చాలా కష్టం అని - అప్పటికే ప్రేమ వలలో పూర్తిగా ఇరుక్కుపోయిన వేణు ఎలా బయటపడ్డాడు?

మొదటిపేజీ నుంచి చివరి పేజీ వరకూ సస్పెన్సుతో మిమ్మల్ని మరోలోకంలోకి తీసుకుపోయే శైలిలో, అత్యద్భుతమైన శిల్పంతో, పరిపూర్ణమైన పాత్రల చిత్రణతో యండమూరి వీరేంద్రనాథ్‌ కలం నుంచి వచ్చిన మరో హరివిల్లు 'సంపూర్ణ ప్రేమాయణం'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good