సంస్కృతములో 'సుహృల్లాభము' 'సుహృద్భేదము', కాకోలూకీయము, లబ్ధప్రణాశము, అసంప్రేకితకారము అనే ఐదు9 తంత్రములు పంచతంత్రమనే గ్రంధంగా పేరుగాంచింది. మహా పండితుడైన విష్ణుశర్మ ఈ పంచతంత్రమును రచించాడు. ఈ గ్రంధములో మనుషులతోపాటు జంతువులను కూడా ప్రధాన పాత్రధారులుగా కవి మలచినా - మృగప్రాయమైన మనుషుల స్వభావాలను జంతువులలో ప్రవేశపెట్టి, అటువంటి వారిని నీతిగా వుండమని చెప్పడమే ఇందులో ముఖ్యోద్ధేశం.
వెన్నెల ఏవిధంగా చీకటిని పారద్రోలి ప్రకాశవంతం చేస్తుందో - అలాగే మనిషిలోని అవినీతిని పోగొట్టి, వివేకాన్ని కలిగిస్తుందని నీతిచంద్రిక భావము. దీనిని పఠించువారి సౌకర్యం కోసం శబ్దార్ధ వ్యాఖ్యానము చేసినవారు శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారు. చిన్నయసూరి, వీరేశలింగము రచనలు వేరు వేరు గ్రంధములుగా ఉండగా వాటిని ఒక్కటిగా కలిపి 'నీతి చంద్రిక'ను తెలుగు వారికి అందిస్తున్న ప్రచురణకర్తలు అభినందనీయులు.
Rs.150.00
In Stock
-
+