ప్రతి సీజన్లో దొరికే పండ్లలో ఏదో ఒకటి ప్రతిరోజూ తినడం మన శారీరక, మానసిక ఆరోగ్యాలకు అవసరం. మారుతున్న జీవన విధానాలు.. చెదిరిపోతున్న సంబంధ బాంధవ్యాలు... పరుగులు తీసే జీవనశైలి.. కారణాలు ఏవైయితేనేం... ఆరోగ్యకర అలవాట్లకు దూరమైన చాలామంది అనారోగ్యాన్ని పరోక్షంగా ఆహ్వానిస్తున్నారు. వయసు తారతమ్యం లేకుండా ప్రతి రోజూ తాజా పండ్లను తినడం మంచిది. ప్రకృతిపరంగా లభ్యమవుతున్న పండ్లలో వివిధ వైటమిన్లు, ఖనిజలవణాలు, పీచుపదార్థం ఎక్కువగా ఉంటాయి.
ఏదో ఒక తాజా పండును ప్రతిరోజూ తినే వారు తమ గుండెను జాగ్రత్తగా పదిలంగా కాపాడుకుంటున్నట్లే.
ఈ చిరుగ్రంథంలోని 26 అధ్యాయాలలో వివిధ పండ్లలో ఏఏ పోషక విలువలు ఉన్నాయో, వాటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల వివరాలను పొందుపరిచారు రచయిత శ్రీ వాసవ్య. ఏఏ పండ్లను ఏఏ అస్వస్థతలు, వ్యాధులు ఉన్నవారు తినకూడదో వివరించారు.