వసంతకాలపు అందాలకూ, ఆనందాలకూ మనిషి రోజు రోజుకూ దూరమవుతున్నాడు. సాంఘికంగా తన వసంత కాలాన్ని తాను సృష్టించుకుంటున్నాడు. కొత్త వస్తువులు, కొత్త సరకులు, ఆ సరకుల ఆరాధన, మాయ, కొత్త ఆశలు, అత్యాశలు, కొత్త అమ్మకాలు, కొత్త కొనుగోళ్ళు, చిగురించి వికసించి విప్పారి ఆక్టోపస్‌లయ్యే షేర్‌ మార్కెట్లు, బజార్లు, మండీలు ఇది వుత్పత్తి రంగంలో అనివార్యంగా మనిషి సృష్టించుకుంటున్నానని సంబరపడుతున్న వసంతకాలం. ఇది వసంతకాలమని మానవజాతి భ్రమపడటం కాదు. నమ్ముతోంది. దాని మిరుమిట్లు గొలిపే అందాలకూ, దిగ్భ్రమ కలిగించే జాదూలకూ, అది విసిరే మన్మథ బాణాలకూ, వలపు వలలకూ ముగ్థులై మానవులు అందులో చిక్కుకుపోతున్నారు. దానికి బందీలైపోతున్నారు.
బందీలయ్యాక చాలామందికి తెలిసివస్తుంది. ఈ వసంతకాలం నుంచి విముక్తి లేదనీ, గ్రీష్మ, వర్ష ఋతువులకూ, ఆ అనుభూతుల సమతూకానికీ అవకాశమే లేని ఒక సాలెగూటిలో తాము చిక్కుకున్నామని తెలిసివస్తుంది. వాళ్ళ విముక్తి ఈ కృత్రిమ వసంతానికి ఆవల, దాని క్రూరత్వాన్ని అర్థం చేసుకున్నవారి వల్లనే అవుతుంది. ఈ వసంతంలో తిరుగుతూ కూడా దాని గురించిన స్పృహతో దాని మలినాన్ని అంటించుకోని యువతరం వల్లనే కుదురుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good