ఈ చిన్న పుస్తకం 1957లో భారత ప్రభుత్వ విద్యాశాఖ వారు నిర్వహించిన పోటీకి తయారు చేశాను. పండితుల కోసం భారత చరిత్రపై అనేక గ్రంథాలు అందుబాటులో వుండనే వున్నాయి. అయితే భారతదేశ చరిత్ర కుప్లంగా తెలుసుకోవాలనుకునే సాధారణ పాఠకుని దృష్టిలో వుంచుకుని దీనిని రూపొందించాను. ప్రాచీన యుగం నుంచి 1950లో భారత రిపబ్లిక్‌ అవతరణ వరకు భారత జాతి చరిత్రను 45000 పదములలో కుదించడం చాలా కష్టతరమైన పని అనిపించింది. ప్రతి అంశములోను చాలా జాగ్రత్తగా వహించవలసి వచ్చింది. అలా అని ఈ రచన అత్యుత్తమంగా వుందనినేనను. వీలైనంతలో భారత జాతి సాంఘిక, సాంస్కృతిక, ఆర్ధిక విషయాలు, పరిపాలన, రాజకీయ విషయాల గురించి వివరించే ప్రయత్నం చేశాను. ఈ రచనను విద్యాశాఖ వారు అత్యుత్తమైనదిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. - రచయిత హెచ్‌.ఆర్‌.జీ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good