తల్లి గర్భంలో పడినప్పటినుండీ, కాలగర్భంలో కలిసిపోయేదాకా స్త్రీజాతికి ఎదురయ్యే అసమానతలకూ, అవమానాలకూ, అమానుష అనుభవాలకూ చరమగీతం ఆలపించడానికి గొంతెత్తిన యువతి ఎలాంటి సాహసాలు చేసింది? ఆదిశక్తి అంశను తనలోనికి ఆవహింపజేసుకుని, అబల అయిన తనను సబలగా రూపొందించుకుని అపాయాల అంచున అడుగులు వేస్తూ ఆమె సాగించిన సాహసయాత్ర ఆమెను యే గమ్యానికి చేర్చింది?

పురుషాధిక్యత అనే స్వార్థ పర్వతం రెక్కలు ఖండించే మహాప్రయత్నంలో - ''పుత్రిక వద్దు - పుత్రుడు ముద్దు'' అంటూ పరోక్షంగా చాటే సామూహిక ''పుత్ర కామేష్టి'' యజ్ఞాన్ని భగ్నం చేసే అనితర సాధ్యమైన సహజమైన సాహసంతో ఉద్యమించిన ఆదర్శ యువతి సహజ విజయం సాధించిందా? యీ ప్రశ్నలకు సమాధానాలు కళ్ళకు కట్టాలంటే చదవండి ''సంభవామి గృహే గృహే!''

పేజీలు : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good